Home > UNCATEGORY > జీజేసీ గీసుగొండలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

జీజేసీ గీసుగొండలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

BIKKI NEWS (NOV. 27) : Counselling programme on mental health at GJC Geesugonda. ప్రభుత్వ జూనియర్ కళాశాల గీసుగొండలో ప్రిన్సిపాల్ యన్. ఆశోక్ రావు ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టెలి మానస్ శిక్షకుడు, సైక్రియాటిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Counselling programme on mental health at GJC Geesugonda.

ఈ సందర్భంగా డాక్టర్ భరత్ కుమార్ మాట్లాడుతూ హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటులో భాగంగా ఉదయమే నిద్రలేచి వ్యాయామం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, సమతుల ఆహారం తీసుకోవాలని, ప్యాకేజ్డ్ ఫుడ్ ను దూరంగా ఉంచాలని సూచించారు.

విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కీలకమని ఈ సందర్భంగా తెలియజేశారు. సమయానికి నిద్రపోవడం మరియు నిద్రలేవడం చాలా ముఖ్యమని, నిద్రపోయేముందు సెల్ పోన్ లకు దూరంగా ఉండడం మంచిదని తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ యన్. అశోక్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి మానసిక సమస్యలున్న తెలియజేయాలని ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేయడానికి టెలి మానస్ శిక్షకులు భరత్ కుమార్ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో మెలగడం ద్వారా కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ అశోక్ రావు, స్టూడెంట్ కౌన్సిలర్ ఎన్. రాజకుమార్, అధ్యాపకులు రమణాకర్, శశిధర్, మహేందర్, వెంకట నారాయణ, ప్రసాద్, శ్రీనివాస్, జ్యోతి, చందన, రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు