రేపటితో ముగియనున్న DOST కౌన్సెలింగ్.

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలలో ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా నవంబర్ 27 నుంచి వచ్చే నెల 2 వరకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) కన్వీనర్ ప్రొ. ఆర్.లింబాద్రి తెలిపారు.

ఈ అవకాశం కేవలం అడ్మిషన్ల కోసం ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు పొందనివారు, రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇవ్వనివారు, సీటు పొంది కాలేజీలో కన్ఫర్మ్ కాని విద్యార్థులు ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు అర్హులు.

ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు వచ్చే నెల 4న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 4 నుంచి 7 వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

◆ వెబ్సైట్ ::

https://dost.cgg.gov.in/

Follow Us@