ఇంటర్ విద్యార్థుల వివరాలను సరిదిద్దుకునే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన వివరాలను అడ్మిషన్ల డేటా/నామినల్ రోల్స్ లో సరి చేసుకునే అవకాశాన్ని డిసెంబర్ – 15 – 2021 వరకు ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది.

మార్చి – 2022 పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల వివరాలను అనగా ఫోటో, సిగ్నేచర్, మాతృభాష, రిలీజియన్, సబ్ క్యాస్ట్, జెండర్, కమ్యూనిటీ తదితర అంశాలను సరిచూసుకొని తప్పులను సరి చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది.

సంబంధిత కళాశాల యాజమాన్యాలు విద్యార్థికి 300 రూపాయలు చొప్పున ఇంటర్మీడియట్ బోర్డు కు చెల్లించి తప్పులను సరిదిద్దుకుని అవకాశం కలదు. అడ్మిషన్ల డేటా/నామినల్ రోల్స్ కరెక్షన్ గడువు చివరి తేదీని డిసెంబర్ 15 గా నిర్ణయించారు.

Follow Us @