ఉచిత కార్పొరేట్ ఇంటర్ విద్యా పథకం

  • పదోతరగతిలో 7.0 జీపీఏ, ఆపైన సాధించినవారు అర్హులు
  • ఎంపికైతే ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో
  • జూలై 8 నుంచి 20 వరకు గడువు

హైదరాబాద్ (జూలై – 15) : ఇంటర్మీడియట్ విద్య కొరకు చాలా మందికి ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చేరాలని ఉంటుంది. ఆర్థికంగా ఉన్నవారికైతే ఇబ్బంది ఉండదు. కానీ పేద విద్యార్థుల ఈ కల సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్య పథకాన్ని తీసుకువచ్చింది. పదో తరగతిలో ప్రతిభ చూపిన వారు ఈ పథకం ద్వారా ఉచితంగా చదివేందుకు అవకాశం కల్పిస్తోంది.

★ అర్హతలు :: ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలు, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ, షెడ్యూల్డ్ కులాల వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ విద్యాలయాల్లో చదివి ఉండాలి. పదో తరగతిలో 7.0 జీపీఏ, ఆపైన సాధించినవారు మాత్రమే అర్హులు. 2021-22లో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలతోపాటు దివ్యాంగ విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల విద్య పథకంలో అవకాశం కల్పిస్తున్నారు.

ఈ ఏడాది ఒక్కో శాఖకు 100 చొప్పున సీట్లు కేటాయించనున్నారని సమాచారం. ప్రవేశం పొందిన విద్యార్థులకు రెండేళ్లపాటు రూ.35 వేల చొప్పున ట్యూషన్ ఫీజు. ప్యాకెట్ మనీ కింద రూ.3 వేల చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది.

దరఖాస్తు విధానం ::ఆన్లైన్ ద్వారా (http://telanganaepass.cgg.gov.in)
ప్రాధాన్యతాక్రమంలో 3 కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ-పాస్ సిస్టమ్ ద్వారా విద్యార్ధుల ఎంపిక ఆటోమే టిక్ గా జరగడంతోపాటు కళాశాలలు అలాట్ అవుతాయి.

కావాల్సిన పత్రాలు.:: పదోతరగతి మెమో, కులం, ఆదాయం ధ్రువపత్రాలు (మీసేవ ద్వారా పొందినవి). బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు సైజు ఫొటో, మూడేళ్ల బోనఫైడ్ సర్టిఫికెట్లు.

దరఖాస్తు గడువు : జూలై 8 నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

★ వెబ్సైట్ :: http://telanganaepass.cgg.gov.in

Follow Us @