ఇతర కంపెనీలకు కరోనా వ్యాక్సిన్ పార్ములా – కేంద్రం

కరోనా నివారణ లో బాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్ యొక్క కో-వ్యాక్సిన్ యొక్క ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి భారతీయులకు వేగవంతంగా వ్యాక్సినేషన్ చేసే ప్రక్రియలో భాగంగా వ్యాక్సిన్ పార్ములాను ఇతర ఫార్మా కంపెనీలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది.

దీనికి భారత్ బయోటెక్ కంపెనీ కూడా ఒప్పుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రులు జగన్, కేజ్రీవాల్ లు ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ వ్రాసిన విషయం తెలిసిందే.

Follow Us@