కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు ప్రకారం ఈ మార్గదర్శకాలు వెలువడ్డాయి
- కరోనా బారిన పడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలలకు టీకా తీసుకోవాలని సూచించింది. అంతకుముందు ఇది 4-8 వారాలుగా ఉండేది.
- ఫస్ట్ డోస్ తీసుకున్నాక కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే 3 నెలల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి.
- తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందిన వారు టీకా కోసం 4 – 8 వారాలు వేచి ఉండాలి.
- టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయాలి. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన తర్వాత 14 రోజులకు కూడా రక్తదానం చేయొచ్చు.
- వ్యాక్సినేషన్‌కు ముందు కరోనా నిర్ధారణ పరీక్ష అక్కర్లేదు అని తెలిపింది.
- బాలింతలు కూడా టీకా తీసుకోవచ్చు అని సూచించింది. గర్భిణీలకు టీకా ఇచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.