ఒక్క రోజే 10 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. గడచిన 24 గంటలలో రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

నిన్న 52 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, 2094 మంది మరణించారు. మరో 69,221 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 99,638 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Follow Us@