భారత్ లో కరోనా థర్డ్ వేవ్ పట్ల కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

ప్రపంచమంతా కరోనా థర్డ్‌ వేవ్‌ వైపు మల్లుతున్నదని, కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిన్న చేసిన హెచ్చరించిన నేపథ్యంలో భారత దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందా లేదా అన్నది తెలుసుకునేందుకు రానున్న 100 రోజులు కీలకమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మన జనాభాకు ఇంకా కరోనా ముప్పు తొలగలేదని, అందుకే నిరంతర వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.

కరోనా థర్డ్‌ వేవ్‌, ఫోర్త్‌ వేవ్‌ అన్నది ముఖ్యం కాదని వైరస్‌ వ్యాప్తి తీవ్రత ముఖ్యమని, ఆంక్షల సడలింపు నేపథ్యంలో మాస్కులను ధరించడంపట్ల ప్రజలు నిర్లక్షం వహించడం ఆందోళన కలిగిస్తున్నదని.., దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ రేటు పది శాతానికిపైగా ఉన్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.