ప్రపంచం థర్డ్ వేవ్ మొదటి దశలో ఉంది – WHO

క‌రోనా వైర‌స్ యొక్క డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న త‌రుణంలో కోవిడ్ థర్డ్ వేవ్ తొలి దశ‌లో ప్ర‌పంచం ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్ హెచ్చ‌రించారు.

జెనీవాలో ఆయ‌న మాట్లాడుతూ.. మ‌నం క‌రోనా థర్డ్ వేవ్ ఆరంభ ద‌శ‌లో ఉన్నామ‌న్నారు. క‌రోనా వైర‌స్ నిరంత‌రం రూపాలు మార్చుకుంటుందని, మ‌రింత ప్ర‌మాద‌క‌రమైన వేరియంట్లు ఉద్భ‌విస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

111 దేశాల్లో ప్ర‌స్తుతం డెల్టా వేరియంట్ వైర‌స్ విస్తరించిదని, అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉన్న‌యాని టెడ్రోస్‌ తెలిపారు.