దేశంలో, రాష్ట్రంలో కరోనా డెంజర్ బెల్స్

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు విజృంభిస్తుంది. దేశంలో కరోనా విశృంఖలంగా వ్యాపిస్తుంది. గడచిన 24 గంటలలో నమోదు అయినా కేసుల వివరాలు…

దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,52,879 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా మరో 839 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణ లో గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 551, మేడ్చల్‌లో 333, రంగారెడ్డిలో 271 నమోదయ్యాయి.

Follow Us@