తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన సోమవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న సీఎస్ ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. వైద్యుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని పేర్కొన్నారు. సీఎంకు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని చెప్పారు.
Follow Us@