తెలంగాణలో కరోనా విజృంభణ – ఒక్క రోజే 1498 కేసులు.

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 1,498 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.

వైరస్‌ ప్రభావంతో 6గురు మృతి చెందారు. 245 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇవాళ నమోదైన కేసులతో యాక్టివ్ కేసులు 10వేలకు చేరువయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 313 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి.

Follow Us@