ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 84 లక్షల కరోనా బడ్జెట్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కరోనా నివారణ చర్యల్లో భాగంగా 84,47,300 రూపాయలను విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 1 నుండి రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పున ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళాశాలలో పూర్తి స్థాయిలో శానిటేషన్ కొరకు మరియు కళాశాలలో కరోనా నివారణ చర్యలలో భాగంగా మాస్కులు, శానిటైజర్ లు, థర్మో మీటర్లు, క్లీనింగ్ మెటీరియల్స్ కొనుగోలుకు ఈ బడ్జెట్ ను వినియోగించెందుకు విడుదల చేయడం జరిగింది.

జిల్లా ఇంటర్విద్యా అధికారులు ఈ బడ్జెట్ ను వినియోగించేందుకు ఇంటర్విద్యా అధికారి, సీనియర్ ప్రిన్సిపాల్ మరియు ఈ పరికరాల కోనుగోలు కు సంబంధం ఉన్న సబ్జెక్ట్ ఎక్సపర్ట్ లతో కమిటీని ఎర్పర్చి ఈ పరికరాలను కోనుగోలు చేసి కళాశాల ప్రిన్సిపాల్ లకు అందజేయాల్సి ఉంటుంది.

Follow Us@