- మెస్సీ సారథ్యంలో అతి పెద్ద టైటిల్
- ఏకైక గోల్ ని అర్జెంటీనా ఆటగాడు ఏజెల్ డీ మారియా
- అత్యదిక సార్లు(15సార్లు) కోపా విజేతలుగా ఉరుగ్వే & అర్జెంటీనా
- రన్నరప్ గా బ్రెజిల్
కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీని లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రియోలోని మారకానా స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించి సొంతం చేసుకున్నది.
ఈ మ్యాచ్ లో నమోదు అయినా ఏకైక గోల్ ని అర్జెంటీనా ఆటగాడు ఏజెల్ డీ మారియా చేసి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని సాధించిపెట్టాడు. అర్జెంటీనా 28 ఏండ్ల తర్వాత కోపా అమెరికా టోర్నీని కైవసం చేసుకోవడంలో సహయపడ్డాడు.
మొత్తంగా ఇప్పటివరకు ఆ జట్టు 15 సార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో కోపా అమెరికా టోర్నీలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా ఉరుగ్వే సరసన నిలిచింది.
కోపా అమెరికా అవార్డులు
- గోల్డెన్ బూట్ అవార్డు – లియోనల్ మెస్సీ (అర్జెంటీనా)
- బెస్ట్ ప్లేయర్ అవార్డు – లియోనల్ మెస్సీ (అర్జెంటీనా) & నెయిమర్ (బ్రెజిల్)
- గోల్డెన్ గ్లోవ్ అవార్డు – ఇమిలానో మార్టినేజ్
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు – డీ మారియా (అర్జెంటీనా)
- పెయిర్ ప్లే అవార్డు – బ్రెజిల్