కాంట్రాక్టు టీచర్లు టీడీఎస్ పరిధిలోకి రారు – ఐటీ శాఖ

ప్రభుత్వ విద్యా సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్ లు ఆదాయపన్ను చట్టం లోని 194J సెక్షన్ పరిధిలోకి రారు అని తాజాగా ఆదాయపన్ను శాఖ స్పష్టతనిచ్చింది.

194J సెక్షన్ పరిధిలోకి ప్రొపెషనల్స్ మాత్రమే వస్తారని కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్ లు రారు అని ఈ అంశంపై స్పష్టత కోసం గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య పరిరక్షణ సమితి (TIPS) ఆదాయపన్ను శాఖకు దఖాలు చేసిన దరఖాస్తుకు ప్రత్యుత్తరంగా ఐటీ శాఖ స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు కాంట్రాక్టు లెక్చరర్ లు వేతనంలో 10% టీడీఎస్ రూపంలో కోత విధిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో TIPS ప్రతినిధులు జంగయ్య, రామకృష్ణ గౌడ్, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, నగేష్ లు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us @