కాంట్రాక్టు అధ్యాపకులు TDS పరిధిలోకి రారు – ఐ.టీ. శాఖ

  • TDS పరిధిలోకి రారని గతంలోనే స్పష్టత ఇచ్చిన ఆదాయపు పన్ను శాఖ
  • ప్రతి సంవత్సరంTDS పేరుతో గందరగోళం
  • నెలనెలా రాని వేతనాలతో TDS మినహాయింపు ఎలా.?

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఆదాయ పన్ను చట్టం 194 (J) ప్రకారం వచ్చే వేతనంలో ప్రతి నెల 10 శాతం TDS రూపంలో మినహాయింపు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డ్రాయింగ్ ఆఫీసర్లు సిద్ధమైన విషయం తెలిసిందే.

అయితే గతంలో పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ అస్మతుల్లా ఖాన్ ఆదాయపు పన్ను శాఖకు తమ ఉద్యోగం ఆదాయపు పన్ను సెక్షన్ లలో 194 (J) లేక 192 పరిధిలోకి వస్తుందా తెలపాలని లేఖ రాయడం జరిగింది.

ఆదాయపన్ను శాఖ ప్రత్యుత్తరం రాస్తూ కాంట్రాక్టు లెక్చరర్ నియామక విధానం ప్రకారం కమీషనరేట్ కు ఉద్యోగికి మద్య ఎంప్లాయర్ – ఎంప్లాయ్ సంబంధం ఉందని, మీరు తీసుకునే వేతనం “సాలరీ” గా పరిగణించవచ్చని కానీ ప్రొఫెషనల్ ఫీజు గా పరిగణనలోకి తీసుకోవడం లేదని… కావున కాంట్రాక్టు అధ్యాపకులు 192 ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి వస్తారని 194 (J) పరిధిలోకి రారాని స్పష్టంగా తెలిపారు.

కానీ ప్రస్తుతం జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు 194 (J) ప్రకారం 10% టిడిఎస్ ప్రతినెల వేతనంలో మినహాయించాలని ఇంటర్, కాలేజీయోట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్లు మరియు డ్రాయింగ్ ఆపీసర్లు కోరుతున్నట్లు సమాచారం. TDS విషయం మీద కమిషనరేట్ ల నుండి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఒకో జిల్లాలో ఒక రకంగా ఈ టీడీఎస్ మినహాయింపులు ఉండటం గందరగోళానికి గురి చేస్తుందని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నాయకులు వాపోతున్నారు

కాంట్రాక్టు అధ్యాపకుల TDS విషయం మీద కమిషనరేట్ కార్యాలయాలే స్వయంగా ఆదాయపన్ను శాఖ నుండి వివరణ తీసుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నదని సంఘ నాయకులు తెలిపారు.

తమకు నెలనెలా వేతనాలు రానిపక్షంలో ప్రతినెల టిడిఎస్ మినహాయింపు సాధ్యము కాదని అలాగే మూడు నెలలకు ఒకసారి TDS RETURNS చేయడం కూడా సాధ్యం కాదని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘాల నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us @