సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన కాంట్రాక్ట్ లెక్చరర్ ల సంఘాల నాయకులు

హైదరాబాద్ (మే – 02) : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల/అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఫైల్ పై తొలి సంతకం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వివిధ కాంట్రాక్టు లెక్చరర్ ల సంఘ నాయకులు ఈరోజు డా.బి.అర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హరీష్ రావు & పల్లా రాజేశ్వర్ రెడ్డిల అద్వరంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాల నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. త్వరలోనే క్రమబద్ధీకరణ గావించబడిన అధ్యాపకుల పేర్లతో కూడిన ఉత్తర్వులను ఉన్నత విద్యా శాఖ విడుదల చేయనున్నట్లు సమాచారం.