విజయవాడ (డిసెంబర్ – 22) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు మరియు పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ లెక్చరర్ల వయోపరిమితి పై ఇచ్చిన తీర్పు ఆధారంగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు మరియు పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల వయోపరిమితిని 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడడం జరిగింది.