త్వరలో కాంట్రాక్టు లెక్చరర్ ల జీవితాలలో వెలుగులు – TGPLA – C

హైదరాబాద్ (మార్చి – 19) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్యమ హామీ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్ క్రమబద్దీకరణపై వస్తున్న అపోహలను, అసంబద్ధ ప్రచారాలను నమ్మవద్దని తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్ల అసోసియేషన్ (కాంట్రాక్ట్) సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఉమా శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్మతుల్లా ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ ఇమ్మాన్యుయోల్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం… మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల సహకారంతో అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఏప్రిల్ ఒకటో తేదీన క్రమబద్ధీకరణ జరిగి కాంట్రాక్టు ఉద్యోగుల, లెక్చరర్ల జీవితాలలో వెలుగులు నిండుతాయని ఎలాంటి అబద్ధ ప్రచారాలకు, మోసపూరిత ప్రకటనలకు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలిపారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @