Home > EMPLOYEES NEWS > ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి ఒకేషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకుల వినతి

ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి ఒకేషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకుల వినతి

  • జనగామ జిల్లా జేఏసీ సభ్యులు

BIKKI NEWS (FEB. 25) : ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ కాకుండా మిగిలి పోయిన 411 మంది ఒకేషనల్ కాంట్రాక్ట్ అధ్యాపకులను ఆదుకోవాలని టీచర్ ఎం ఎల్ సీ నర్సిరెడ్డి సార్ కి జే ఏ సీ సభ్యులు మరిపెల్ల రవి ప్రసాద్, కదిర రవీందర్ లు వినతి పత్రం (Contract Lecturers regularization issue) సమర్పించారు. ఆదివారం జనగామ పట్టణంలోనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో లో ఒకేషనల్ అధ్యాపకులు నర్సిరెడ్డి గారిని కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్ కాకుండా మిగిలి పోయిన కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రెగ్యులర్ అయ్యేలా చూడాలని టీచర్ ఎం ఎల్ సీ నర్సిరెడ్డి గారిని కోరారు.

ఈ సందర్భంగా నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రావు,కార్యదర్శి బాబయ్య తదితరులు పాల్గొన్నారు.(తెలంగాణ ఇంటర్ మీడియేట్ నాట్ రెగ్యులరైజ్డ్ ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ)