హైదరాబాద్ (ఫిబ్రవరి – 06) : కాంట్రాక్ట్ అనే బానిస వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించే ప్రకటనను నేడు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభ వేదికగా బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 11వేల కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ ఒకటి నుండి క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు.
15 సంవత్సరాల క్రితం హరీష్ రావు టీఆరెస్ నాయకుడిగా 2005లో కేసీఆర్ ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ అధ్యాపకులు క్రమబద్ధీకరణ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ దీక్షా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. నేడు ఆర్థిక శాఖ మంత్రిగా నిండు శాసనసభలో కాంట్రాక్ట్ అనే బానిస వ్యవస్థను ఏప్రిల్ ఒకటి నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం.
ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి, విద్యా శాఖ, ఆర్థిక శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు 475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.
Follow Us @