త్వరలో కాంట్రాక్టు లెక్చరర్ ల క్రమబద్ధీకరణ

విజయవాడ (ఎప్రిల్‌ – 22) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలోనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తొలుత కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల లెక్కలు తీస్తున్నామని దాదాపు 15వేలకు పైగా పోస్టులను గుర్తించామని, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే డీఎస్సీతోపాటు లెక్చరర్ల పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.