కరోనాతో మృతి చెందిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలి – 475 యూనియన్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు గత నెల రోజుల్లో దాదాపు 6 గురు కరోనాతో చనిపోయారని వారి కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల 475 సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో విన్నవించుకున్నారు.

ఉన్నత విద్యా శాఖ లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఎలాంటి సామాజిక, ఆర్థిక, ఉద్యోగ భద్రత లేదని తెలిపారు. కరోనా బారిన పడిన కాంట్రాక్టు అధ్యాపకులను తగినంత ఆర్థిక సహాయం చేయాలని మరియు కరోనా తో మరణించిన వారి కుటుంబాలు జీవించడానికి పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా విన్నవించుకున్నారు.

ఈ మధ్య కాలంలో దాదాపు ఆరుగురు జూనియర్ మరియు డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ లు కరోనా కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. వారిలో హనుమాండ్లు, సత్యం, ప్రభాకర్, సుదర్శన్, అయ్యాలు, పోశెట్టి తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఇంకా కొంతమంది కరోనాతో మృతి చెందినట్లు ఈ సందర్భంగా సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు.

వీరి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. అలాగే కరోనా తో చాలా మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇబ్బంది పడుతున్నట్లు వారికి వ్యాక్సిన్ విషయంలో ప్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించాలని తెలిపారు.

కాంట్రాక్టు అధ్యాపకులు మరియు వారి కుటుంబాలు కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా మరియు ధైర్యంగా ఉండాలని.., ప్రభుత్వం నుంచి కరోనా బారిన పడిన కాంట్రాక్టు అధ్యాపకులకు మరియు కరోనాతో మృతి చెందిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలకు తగిన సహాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

Follow Us@