కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, మంత్రికి సన్మానం చేసిన కాంట్రాక్టు లెక్చరర్స్

సూర్యాపేట (మే – 02) : తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్ పై ముఖ్యమంత్రివర్యులు కే. చంద్రశేఖర్ రావు తొలి సంతకం చేయడము… ఆర్థిక మరియు ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ రావు కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ చైర్మన్ కనక చంద్రంకు జీవో ప్రతిని అందించడం జరిగిందని..ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని… ఈ కార్యక్రమంలో జానపాటి కృష్ణయ్య డిఐఈఓ సూర్యాపేట జిల్లా గారితో పాటు ఒప్పంద అధ్యాపకుల ఇరు సంఘాల అధ్యక్షులు 711 సంఘం జిల్లా అధ్యక్షులు మారం హేమచందర్ రెడ్డి మరొక సంఘం 475 జిల్లా అధ్యక్షులు గునగంటి వెంకటేశ్వర్లు మరియు అధ్యాపక సంఘం నాయకులు చీకూరి కృష్ణ, నవీన్ కుమార్, ఈశ్వర్,పుల్లయ్య, శ్రీమతి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

తదనంతరం సూర్యాపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందించి ధన్యవాదములు తెలపడం జరిగిందని. ఇరుసంఘాల అధ్యక్షులతో పాటు గునగంటి రమేష్, కొల్లు శ్రీనివాస్, టి. ఉపేందర్, దశరధ, యన్.రమేష్, రమేశ్, భగతసింగ్, వెంకట క్రిష్ణమాఛారి, ప్రదీప్, కృష్ణ, రవి, నాగార్జున తదితరులు పాల్గొని మంత్రి గారితో మాట్లాతుతూ శాంక్షన్ జీవోలు లేని కారణంగా క్రమబద్ధీకరింపబడని అధ్యాపకుల సర్వీసును కూడా క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో రెగ్యులర్ అయిన అధ్యాపకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేద్దామని తెలిపారు.