నేడే కాంట్రాక్టు అధ్యాపకులతో హరీష్ రావు ఆత్మీయ సమ్మేళన సభ – కనకచంద్రం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో సిద్దిపేటలో ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనాలని 711 రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కనక చంద్రం, డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈ ఆత్మీయ సమ్మేళన సభ జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ని మన సమస్యలను కెసిఆర్ హరీష్ రావు దృష్టికి తీసుకువెళతామని ముఖ్యంగా నూతన పిఆర్సి ప్రకారం బేసిక్ పే కాంట్రాక్టు అధ్యాపకులకు వర్తింపజేసే అంశాన్ని ఈ సభలో ప్రకటన చేసే అవకాశం ఉందని తెలియజేశారు.

అలాగే ముఖ్య సమస్యలు అయినా సర్వీస్ క్రమబద్ధీకరణ, సాధారణ సెలవులు పెంపు, బదిలీలు, నెల నెల వేతనం, ఉద్యోగ భద్రత వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడానికి ఈ ఆత్మీయ సభ ఉపయోగపడుతుందని తెలిపారు.

Follow Us @