కాంట్రాక్టు లెక్చరర్ ల మ్యుచువల్ బదిలీలు

హైదరాబాద్ (జనవరి – 09) : తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు పరస్పర బదిలీలు చేస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ బదిలీలు ఏప్రిల్ -01 – 2023 నుంచి అమలు అవుతాయని ఉత్తర్వులలో స్పష్టం చేశారు

మల్టీజోన్ – 1 లో 67 మందికి, మల్టీజోన్ – 2 లో 35 మందికి పరస్పర బదిలీలకు ఆమోదం తెలుపుతూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.