ప్రభుత్వ మద్దతుతో సీజేఎల్స్ సమస్యల పరిష్కారానికి కృషి – కనకచంద్రం

ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మెరుగు లింగయ్య, ప్రధాన కార్యదర్శి చిప్పలపెల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి ప్రధాన అతిథిగా కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రంతో పాటు వివిధ జిల్లాల నాయకులు ప్రధాన కార్యదర్శులు మరియు జూనియర్ అధ్యాపకులు పాల్గొని విజయవంతం చేశారు.

కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల భవిష్యత్ కార్యాచరణ సాధించిన, సాధించాల్సిన హక్కులు గురించి ఈ సమావేశంలో కూలంకషంగా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో చర్చ జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక చర్యలతో ఏమీ సాధించలేమని, ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటూ జూనియర్ అధ్యాపకులు తమ హక్కులను సాధించుకోవాలని తెలిపారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల ప్రతి సమస్య పైన తాను ముందుండి నడిపిస్తానని తెలిపారు.

అలాగే 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ అభ్యర్థులకు మద్దతు తెలపడం ద్వారా బేసిక్ పే మరియు 12 నెల వేతనం సాధించామని ఇది కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్ల మాత్రమే సాధ్యం అయిందని తెలిపారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణి దేవి లకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యంగా కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ జీవో మీద ఉన్న కేసును వెకేట్ చేయించడం ఈ లోపు క్రమబద్ధీకరణ జరిగే వరకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా ప్రయోజనాలు పొందాలని, మరియు నెలనెల వేతనం, పీఆర్సీ అమలు, బదిలీలు, సీయల్స్ వంటి ప్రధాన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

దీనికోసం మనము ఎమ్మెల్సీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణి దేవీలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి వారిని గెలిపించుకొని తద్వారా ప్రభుత్వం ద్వారా మన హక్కులను రాబట్టుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి, 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మెరుగు లింగయ్య, ప్రధాన కార్యదర్శి చిప్పలపెల్లి అంజయ్య, రాష్ట్ర నాయకులు జిల్లా నరసింహ, కడారి శ్రీను, కొండల్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు హేమచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి వనపర్తి శ్రీనివాస్,నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@