అమర వీరుల స్థూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ఈ రోజు సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చేసిన ప్రకటన తో హైదరాబాదులో కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ చైర్మైన్ కనక చంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ అమరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్ర పటానికికి పాలాభిషేకం చేయడం జరిగిందని హైదరాబాద్ జిల్లా 711 నాయకులు కడారి శ్రీనివాస్ తెలిపారు.

ఈ సందర్భంగా అమర వీరుల స్థూపం వద్ద భారీగా చేరుకున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు తమ సర్వీస్ క్రమబద్దీకరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కి, తన్నీరు హరీష్ రావుకి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి, కనకచంద్రంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కడారి శ్రీనివాస్, మాలతి, గాదె వెంకన్న, కుమార్, రహీమ్, సత్యనారాయణ, శోభన్, పురుషోత్తం, జగన్, శ్రీపతి, అంజనేయులు మరియు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టు లెక్చరర్ లు పాల్గొన్నారు.

Follow Us @