ఉట్నూర్ (సెప్టెంబర్ – 04) : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023 -24 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక ప్రతిపాదికన భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు సంబంధిత పీజీ, బీఎడ్ లో 50 శాతం మార్కులు కలిగి, టెట్ పేపర్-2 ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. బాలికల విద్యాలయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
ఆసక్తి అర్హత గల అభ్యర్థులకు సెప్టెంబర్ 6న ఉదయం 10 గంటల నుంచి డెమో ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని గిరిజన బాలికల జూనియర్ కళాశాలలో హాజరు కావాల్సిందిగా కోరారు.