BIKKI NEWS (AUG. 21) : contract jobs in sainik school korukonda 2024. భారత రక్షణ శాఖ కింద పని చేసే విజయనగరం జిల్లాలోని సైనిక్ స్కూల్ కోరుకొండలో ఒక్క సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి పలు పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
contract jobs in sainik school korukonda 2024
ఖాళీల వివరాలు :
- కౌన్సిలర్ – 1
- పీటీఐ కమ్ పాట్రాన్ (F) – 1
- క్రాప్ట్ & వర్క్ షాప్ ఇన్‌స్ట్రక్టర్ – 1
- బ్రాండ్ మాస్టర్ – 1
- హర్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ – 1
- స్కూల్ మెడికల్ ఆఫీసర్ – 1
- నర్సింగ్ సిస్టర్ (F) – 1
- టీజీటి మేథమెటిక్స్ – 1
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ ఉద్యోగ ప్రకటన వచ్చినా రోజు నుండి 21 రోజుల లోపు ప్రత్యక్ష పద్ధతిలో నిర్దేశించబడిన ఫార్మాట్లో అప్లికేషన్ పూర్తిచేసి ప్రిన్సిపాల్ కు అందజేయవలసి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : 500/- (SC, ST – 250/-
దరఖాస్తు ఫీజును ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరుకొండ పేరుతో ఎస్బిఐ కోరుకొండలో డిడి తీయవలసి ఉంటుంది.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ తదితర వివరాల కోసం కింద ఇవ్వబడిన లింకును సందర్శించండి.