AP JOBS : మహిళా శిశు సంక్షేమశాఖలో జిల్లాల వారీగా ఒప్పంద ఉద్యోగాలు

విజయవాడ (నవంబర్ – 15) : ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా వివిధ ఉద్యోగాల భర్తీకి (Contract jobs in andhra pradesh districts) అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా జిల్లాల్లోని మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయాలు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.

ఈ నోటిఫికేషన్ల ద్వారా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి, కౌన్సెలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, నర్సు, డాక్టర్, ఆయా, చౌకీదార్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్, వాచ్‌మెన్ తదితర పోస్టులు భర్తీ కానున్నాయి.

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏడు, పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రత్యక్ష విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు.

ఆఫ్లైన్ దరఖాస్తులను ఆయా జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం చిరునామాకు పంపించాలి.