హైదరాబాద్ (జూలై – 05): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 3,584 మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఫైల్ ను మంగళవారం ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించనుంది.
జీవో నంబర్ 16 ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకుల జాబితా పూర్తి స్థాయిలో స్క్రూటినీ నిర్వహించిన కమీషనరేట్ జాబితా పై సోమవారం రాత్రి ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ సంతకం చేశారు.