హైకోర్టు తీర్పు హర్షనీయం – కనకచంద్రం

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు మరియు ఉద్యోగులను క్రమబద్ధీకరించవద్దని నిరుద్యోగుల తరఫున తెలంగాణ హైకోర్టు నందు 2016 లో నక్కల గోవిందరెడ్డి మరియు జెట్టి శంకర్ లు వేసిన రిట్ పిటిషన్ వేయడం జరిగింది.

దీని మీద నాలుగు సంవత్సరాలుగా హైకోర్టులో వాదోపవాదాలు జరిగిన పిమ్మట ఈ పిటిషన్ లో పస లేదని, క్రమబద్ధీకరణ అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని ప్రకటిస్తూ, పిటిషన్ ను కొట్టి వేస్తూ విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పిటిషన్ దారులకు వెయ్యి రూపాయల చొప్పున అపరాధ రుసుము చేయడం కూడా జరిగింది.

ఈ సందర్భంగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కనుక చంద్రం, శేఖర్, నరసింహ మాట్లాడుతూ దీనికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు ఇతర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు.

అలాగే 16 జీవో మీద ఉన్న పిల్ ను కూడా కొట్టివేయించే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతామని, అతి త్వరలోనే ఆ పిల్ ను కూడా కొట్టివేయించి క్రమబద్ధీకరణ సాదిస్తామని కనకచంద్రం ప్రకటించారు.

Follow Us@