గురుకులాలో 991 మంది కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపునకు అనుమతి

తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో( TREIS)కింద ఉన్న పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన 991 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, అతిధి ఉద్యోగులను 2021 – 22 విద్యాసంవత్సరానికి కొనసాగించడానికి విద్యాశాఖకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువరించింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం 112 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 369 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 510 మంది అతిధి ఉద్యోగులను ఈ విద్యా సంవత్సరానికి కొనసాగించడానికి అనుమతించింది.

ఉత్తర్వులు