రాజస్థాన్ (అక్టోబర్ – 23) : రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న 1.10 లక్షలు పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి నిర్ణయం తీసుకుంది.
గత ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తానని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇచ్చిన హామీ మేరకు కేబినెట్ “రాజస్థాన్ హైరింగ్ టూ సివిల్ పోస్ట్ రూల్స్ – 2022” బిల్లుకు అమోదం తెలిపింది.