అస్సాం రాష్ట్రంలోని పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 5243 మంది కాంట్రాక్ట్ టీచర్లకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ అందించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 5243 మంది కాంట్రాక్టు టీచర్లు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం నుండి అన్ని బెనిఫిట్స్ ను పొందనున్నారు.
పాఠశాల అభివృద్ధి లో భాగంగా కాంట్రాక్ట్ టీచర్లను 2010 నుండి అస్సాం విద్యా శాఖ నియమించుకుంటూ రావడం జరిగింది. దీనితో 2020 వ సంవత్సరం లో వీరి సంఖ్య 5243 కి చేరింది.
కాంట్రాక్టు టీచర్ల సంఘాల డిమాండ్లతో వీరికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ అందించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బెనిఫిట్స్ 2020 జూలై మొదటి తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
మంత్రివర్గ నిర్ణయంతో కాంట్రాక్టు టీచర్లు పొందనున్న బెనిఫిట్స్ కింది విధంగా ఉన్నాయి.
1) రెగ్యులర్ ఉద్యోగుల పే స్కేల్ అమలుపరచడం.
2) 60 సంవత్సరాల వరకు ఉద్యోగ భద్రత కల్పించడం
3) మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించడం
4) కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించడం
5) బ్యాంకు లోన్ ల కు అర్హత సాధించడం
6) పాఠశాలల విలీనం జరిగినప్పుడు వారికి వేరే చోట కచ్చితంగా ఉద్యోగం ఇప్పించడం.
7) ప్రతి పీఆర్సీని వారికి అమలు చేయడం.
8) DA సౌకర్యం కల్పించడం.
9) గ్రాడ్యుయేట్ టీచర్లకు 3% ఇంక్రిమెంట్ ఇవ్వడం.
10) పూర్తి స్థాయి సెలవులను కల్పించడం లాంటి బెనిఫిట్స్ ను పొందనున్నారు.

