ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు లభించిన హామీలు ఏమిటి.?

తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం అనేది ప్రతిసారి ఎన్నికలతో ముడిపడి ఉంది అనేది నిర్వివాదాంశం.

గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం లభించిందంటే అది ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, సాదరణ ఎన్నికల ముందు లబించిన పరిష్కారం మాత్రమే…

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి… దుబ్బాక ఓటమి జిహెచ్ఎంసి లో రాని మెజారిటీ.. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు అటు అధికార పక్షానికి ఇటు బలపడుతున్న బిజెపికి, నిలబడవలసిన కాంగ్రెస్ లకు కత్తి మీద సాము లాంటివి. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు పూర్తిస్థాయిలో సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పార్టీ పూర్తిస్థాయిలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ప్రచారం హోరు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్న 3500 మంది కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల తరఫున ఉన్న సంఘాలు కూడా ఈ ప్రచారంలో భాగం అయ్యాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల నుండి ఏ హామీ తీసుకొని వీళ్ళు ప్రచారం చేస్తున్నారో, ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

ఇలాంటి కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించుకోవాల్సిన ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నా కూడా వాటి గురించి చర్చ ఎక్కడ లేకపోవడం… ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఎక్కడ ప్రకటనలు చేయకపోవడం వంటివి చూస్తున్నాం. అయినా కూడా ప్రచారంలో నిలబడిన అభ్యర్థుల కంటే పోటీ పడి ప్రచారం నిర్వహిస్తున్నారు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నాయకులు. కాని అభ్యర్థులు ఎక్కడ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల మీద మాట్లాడిన సందర్భాలు లేనేలేవు..

ప్రధానంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు బదిలీలు, నెల నెల వేతనం, సాధారణ సెలవులు పెంపు, ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రత వీటిలో దేనికి కూడా ఆర్థిక సంబంధం లేదు. ఇలాంటి సమస్యలను కూడా ఇలాంటి కీలక ఎన్నికల సమయంలో లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్నట్లు దాఖలాలు లేవు. ఏ హామీ తీసుకున్నారని మద్దతు తెలుపుతున్నారో, ఏ హామీ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారోనని ప్రాథమిక సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.

ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్న సంఘాలు గాని, నాయకులు గానీ ఈ విషయంలో ప్రాథమిక సభ్యులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు. బదిలీలు నెలనెలా వేతనం, సాధారణ సెలవులు, ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రతలపై ఒక స్పష్టమైన ప్రకటన అధికార పార్టీ తరఫున అభ్యర్థి నుండి ప్రాథమిక సభ్యులు కోరుకుంటున్నట్లు సమాచారం..

1)బదిలీలపై ఏ MLC లు హామి ఇచ్చారు.
2)ప్రతి నెల ఒకటవ తేదీన వేతనం (010 పద్దు కింద)
3) cls,special cls,మహిళల కు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు
4)జిల్లా సగటు ఉత్తీర్ణత సమస్య 5)Da,HRA
6)ఉద్యోగ భద్రత
7)Health cards .
8)Home loan,personal loan availability వంటి ప్రధాన సమస్యలను సీజేఎల్స్ ఎదుర్కొంటున్నారు.

Follow Us@