TGDCLA గౌరవ అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ (జూలై – 30) : తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ గౌరవ అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి రెగ్యులరైజేషన్ కొరకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లి డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన 527 మంది డిగ్రీ కాంట్రాక్టులు అందరినీ స్టేట్ స్కేల్ ఇస్తూ రెగ్యులర్ చేయాలని విన్నపం చేయడం జరిగింది.

పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా TGDCLA సంఘం నూతన కరపత్రాన్ని ఆవిష్కారం వేయడం జరిగంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ వెంకటేశం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీమతి అరుణ కుమారి మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు.