డిగ్రీ కాంట్రాక్ట్, అతిథి అధ్యాపకుల కొనసాగింపు

హైదరాబాద్ (జూలై – 29) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 527 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను 2023 – 24 విద్యా సంవత్సరం కూడా కొనసాగిస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను ఇప్పటికే క్రమబద్ధీకరించడంతో మిగిలిన వారిని ఆగస్టు 31 లోపు విధుల్లోకి తీసుకోవాలని సూచించారు.

మరోవైపు డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న పాత అతిథి అధ్యాపకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో వారిని కూడా నియమించుకోవాలని కళాశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.