ఆన్లైన్ తరగతులనే కొనసాగించాలి – నిపుణులు

తెలంగాణ లో కరోనా కారణంగా ఇంకా తెరుచుకొని విద్యాసంస్థలను ప్రస్తుతం తెరిచే పరిస్థితులు లేవని విద్యారంగ నిపుణులు తెలియజేస్తున్నారు. చలికాలం ప్రారంభం కావడం ఉత్తరాదిలో చలి కారణంగా కరోనా కేసులు మళ్ళీ పెరగడం వంటి కారణాల దృష్ట్యా విద్యాసంస్థలు తెరవడం అంత శ్రేయస్కరం కాదని, ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వార్షిక పరీక్షలు నిర్వహించాలంటే కనీసం 120 పనిదినాలు అయినా ఉండాలి కాబట్టి పాఠశాల విద్యా శాఖ మరియు ఇంటర్ విద్యా బోర్డు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలను తిరిగి తెరవడానికి అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో డిసెంబర్ 7 లేదా 15 వ తేదీలలో 9,10వ.తరగతులు మరియు ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ నిపుణులు తాజా అభిప్రాయం వెలువరించారు. చలి కారణంగా కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని కావున విద్యాసంస్థలు చలికాలం ముగిసేవరకు తెరవకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్లైన్ తరగతులు కొనసాగించడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

గత నెలలోనే విద్యాసంస్థలు తెరవడానికి అనుమతి ఇవ్వాలంటూ పాఠశాల విద్యా శాఖ మరియు ఇంటర్ విద్యా బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఈ నెలలో అయినా ప్రభుత్వం నుండి పాఠశాలలు కళాశాలలో తెరవడానికి మార్గదర్శకాలు విడుదల అవుతాయో లేక ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్లైన్ తరగతులను మరికొంత కాలం కొనసాగిస్తారో వేచిచూడాలి…

Follow Us@