అతిథి అధ్యాపకులను కొనసాగించాలని కమీషనర్ కు వినతి – దామెర ప్రభాకర్

గత ఆరేడు సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న గెస్ట్ జూనియర్ అధ్యాపకులనే ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా కోనసాగించాలని ఇంటర్మీడియట్ కమీషనర్ ఒమర్ జలీల్ ని కలిసి విన్నవించినట్లు అతిధి అధ్యాపకుల సంఘం (2152) రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్ తెలిపారు.

ఈ సందర్భంగా TIGLA & TIPS సారధి జంగయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్ నేతృత్వంలో ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ని ఈ రోజు హైదరాబాద్ లో కలిసి ఇటీవల విడుదలైన ఫైనాన్స్ ఉత్తర్వులలో నూతనంగా గెస్ట్ లెక్చరర్ల ను నియమించాలనే అంశంపై చర్చించడం జరిగింది. ఈ క్రమంలో గత 7 ఏండ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సేవలందిస్తూ.. కళాశాలల అభివృద్ధికి పాటు పడుతున్న గెస్ట్ లెక్చరర్ల ను, వారి సేవలను పరిగణలోకి తీసుకుని ఈ విద్యాసంవత్సరం కొనసాగించాలని.. విజ్ఞప్తి చేయడం జరిగిందని ప్రభాకర్ తెలిపారు.

కమీషనర్ ఒమర్ జలీల్ స్పందిస్తూ.. ఆరేడు సంవత్సరాలుగా పని చేస్తున్న అతిధి అధ్యాపకుల కొనసాగింపు అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హమీ ఇచ్చినట్లు దామెర ప్రభాకర్ తెలిపారు.