Home > UNCATEGORY > జీజేసీ సంగెంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

జీజేసీ సంగెంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

BIKKI NEWS (NOV. 26) : Constitutional day celebrations in GJC SANGEM. ప్రిన్సిపాల్ కాక మాధవరావు ఆధ్వర్యంలో జీజేసీ సంగెంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

Constitutional day celebrations in GJC SANGEM

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… భారతీయులందరికీ పవిత్ర గ్రంథం రాజ్యాంగమని (నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం). ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం భారత రాజ్యాంగం. అందుకే మన రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు.

భారతదేశానికి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర ప్రతిపత్తిని అందించిన ఘనత మన రాజ్యాంగానిదే. వివిధ కులాల, మతాల, సంస్కృతుల, ప్రాంతాల భారతీయులు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమని,
26 నవంబర్ నాడు రాజ్యాంగ దినోత్సవంను 2015 నుంచి ఏటేటా జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల సివిక్స్ లెక్చరర్ యాక సాయిలు రాజ్యాంగం పుట్టుక, రచించిన విధానం, అందుకు కృషి చేసిన మహనీయులు, రాజ్యాంగం విలువ గురించి ఉపన్యసించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కాక మాధవరావు, సీనియర్ అధ్యాపకురాలు మరియు కళాశాల స్టాఫ్ సెక్రటరీ విజయనిర్మల, గ్రంధపాలకులు రాజకుమార్, అధ్యాపకులు బుచ్చిరెడ్డి, అనిల్ కుమార్, పవన్ కుమార్, కుమారస్వామి, యాక సాయిలు, చిరంజీవి, మాధవి, పద్మ, రమాదేవి, శివ, సంగీత, మరియు విద్యార్తిని, విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు