మల్కాజ్గిరి జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

BIKKI NEWS (NOV. 26) : Constitutional day celebrations in GJC Malkajgiri. ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్కాజ్గిరి యందు 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Constitutional day celebrations in GJC Malkajgiri

ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సీహెచ్. విద్యా సాగర్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో సత్కరించి భారత రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడడం జరిగింది.

అలాగే కళాశాల సీనియర్ అధ్యాపకులు శోభారాణి, నవనీత, లక్ష్మి, శివగౌడ్, రాజమౌళి, రహీం, విజయ్, జగన్, సమ్మయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ముసాయిదా కమిటీ చైర్మన్ రచించిన పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ పరిషత్ – రాజ్యాంగం ఆమోదించిన రోజుగా అభివర్ణించారు,

వీరు కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని కొనియాడారు.

ఈ కార్యక్రమ నిర్వాహకులుగా పాత్ర పోషించిన డాక్టర్ ఎం. గోపి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేటి యువత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా, స్ఫూర్తితో నవ భారత నిర్మాణానికి విద్యార్థులు నడుం బిగించాలని ఉపన్యాసించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు చంద్రశేఖర్, రమణకుమారి, సంతోషి, అరుణ కుమారి, వాసంతి, అరుణ,
విజయ భాస్కర్ రెడ్డి, రాజ్ కుమార్, ఆగస్టీన్ పాల్, శ్రీలత, శ్రీలక్ష్మి మరియు అధ్యాపకేతర సిబ్బంది మరియు తొమ్మిది వందలకు పైచిలుకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు