Home > UNCATEGORY > జి. జే. సి ధర్మకంచలో ఘనంగా పదవ సంవిధాన్ దివాస్

జి. జే. సి ధర్మకంచలో ఘనంగా పదవ సంవిధాన్ దివాస్

  • రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం మన బాధ్యత…కళాశాల ప్రిన్సిపాల్ పావని కుమారి

BIKKI NEWS (NOV. 26) :constitutional day celebrations in GJC Dharmakancha. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకంచ, జనగామ నందు భారత రాజ్యాంగo యొక్క పదవ సంవిధాన్ దివాస్ ను కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన, విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా 2015 నుండి సoవిధాన్ దివాస్ ని జరుపుకుంటున్నాం అని నేటికీ రాజ్యాంగం ఆమోదించి 75 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అని ప్రిన్సిపాల్ పావని కుమారి అధ్యాపకులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

constitutional day celebrations in GJC Dharmakancha

కళాశాల సివిక్స్ లెక్చరర్ కాపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగలలో ప్రత్యేకమైనదని, పెద్దది అని దీనిలో లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఏనాబై ఐదు పదాలున్నాయని, రాజ్యాంగ పీఠికలో అన్ని అంశాలు విశ్లేషణగా ఉన్నాయని తెలిపి, రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అధ్యాపకుల, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు