Constitutional bodies of india – రాజ్యాంగబద్ద సంస్థలు

BIKKI NEWS : Constitutional bodies of india – భారతదేశంలో రాజ్యాంగబద్ద సంస్థలు మరియు వాటికి సంబంధించిన సమాచారం పోటీ పరీక్షల నేపథ్యంలో సంక్షిప్తంగా…

Constitutional bodies of india

1) Election Commission of india (ఎన్నికల సంఘం)

ఆర్టికల్ – 324

నిర్మాణం : ఒక ప్రధాన ఎన్నికల అధికారి మరియు ఇతర ఎన్నికల అధికారులు (సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు)

నియామక విధానం : సెలక్షన్ కమిటీ సలహ మేరకు రాష్ట్రపతి నియమిస్తారు (2023 బిల్లు ఆధారంగా)

కాలపరిమితి : 6 సంవత్సరాలు / 65 సంవత్సరాలు

తొలగించు విధానం : CEC ని ప్రధాన న్యాయమూర్తి ని తొలగించు విధానం వలె

EC లను ప్రధాన ఎన్నికల అధికారి సిఫార్సు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు

విధులు : పార్లమెంట్, శాసనసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ

2) UNION PUBLIC SERVICE COMMISSION (UPSC)

ఆర్టికల్స్ : 315 నుంచి 323

నిర్మాణం : చైర్మన్ + మెంబర్స్ (సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు)

నియామక విధానం : రాష్ట్రపతి నియమిస్తారు

కాలపరిమితి : 6 సంవత్సరాలు / 65 సంవత్సరాలు

తొలగించు విధానం : రాష్ట్రపతి తొలగిస్తారు సుప్రీం కోర్టు (విచారణ) నిర్ణయం మేరకు

విధులు : ఆలిండియా సర్వీసుల (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్ etc.) నియామకం మరియు సెంట్రల్ సర్వీసుల (గ్రూప్ A & B) నియామకం

సర్వీస్ విషయాలలో ప్రభుత్వానికి సలహలు ఇవ్వడం

3) STATE PUBLIC SERVICE COMMISSION (SPSC)

ఆర్టికల్స్ : 315 నుంచి 323 వరకు

నిర్మాణం : చైర్మన్ + మెంబర్స్ (సంఖ్య ను గవర్నర్ నిర్ణయిస్తారు)

నియామకం : గవర్నర్ ద్వారా

కాలపరిమితి : 6 సంవత్సరాలు / 62 సంవత్సరాలు

తొలగించు విధానం : రాష్ట్రపతి తొలగిస్తారు సుప్రీంకోర్టు విచారణ ఆధారంగా

విధులు : స్టేట్ సివిల్ సర్వీస్ నియమకాలను చేపట్టుట

4) FINANCE COMMISSION (ఆర్దిక సంఘం)

ఆర్టికల్ : 280

నియామకం : రాష్ట్రపతి

కాలపరిమితి : రాష్ట్రపతి అభీష్టం మేరకు

విధులు : పన్ను ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాల మధ్య పంచడం.

రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను సిఫారసు చేయడం

కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక లోటును అంచనా వేయడం

మెరుగైన ఆర్థిక విధానాలను రాష్ట్రపతికి సిఫారసు చేయడం

5) GOODS and SERVICES TAX (GST)

ఆర్టికల్ : 279 – A

ఏర్పాటు : 101 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2016)

చైర్మన్ : కేంద్ర ఆర్థిక మంత్రి

సభ్యులు : రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మరియు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రులు

విధులు :

జీఎస్టీ రేట్లను మరియు జీఎస్టీ మినహాయింపులను మరియు జిఎస్టి లా స్ లను రూపొందించడం, నిర్ణయించడం.

జీఎస్టీ ఆధారిత సమస్యలను పరిష్కరించడం

ఇంటర్ స్టేట్ జిఎస్టి విధానాలు రూపొందించడం

6) NATIONAL COMMISSION FOR SCHEDULED CASTES (NCSC)

ఆర్టికల్ : 338

నిర్మాణం : చైర్మన్ + 4 సభ్యులు

ఎంపిక : రాష్ట్రపతి ద్వారా

కాలపరిమితి : 3 సంవత్సరాలు (ఒకరినే రెండు ధఫాలు కంటే ఎక్కువ సార్లు నియమించరాదు)

విధులు :

షెడ్యూల్డ్ కులాల వారి హక్కులను కాపాడటం మరియు వారికి రాజ్యాంగం కల్పించిన విధానాలను అమలు జరిగేలా చూడడం.

షెడ్యూల్డ్ కులాల వారి పై జరిగిన అఘాయిత్యాలపై విచారణ జరపడం

రాష్ట్రపతికి ప్రతి ఏడాది నివేదిక అందించడం

7) NATIONAL COMMISSION FOR SCHEDULED TRIBES (NCST)

ఆర్టికల్ : 338 -A

నిర్మాణం : చైర్మన్ + 4 సభ్యులు

ఎంపిక : రాష్ట్రపతి ద్వారా

కాలపరిమితి : 3 సంవత్సరాలు (ఒకరినే రెండు ధఫాలు కంటే ఎక్కువ సార్లు నియమించరాదు)

విధులు :

షెడ్యూల్డ్ తెగుల వారి హక్కులను కాపాడటం మరియు వారికి రాజ్యాంగం కల్పించిన విధానాలను అమలు జరిగేలా చూడడం.

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం సిఫారసులు చేయడం

రాష్ట్రపతికి ప్రతి ఏడాది నివేదిక అందించడం

8) NATIONAL COMMISSION FOR BACKWARD CLASSES (NCBC)

ఆర్టికల్ : 338 – B

ఏర్పాటు : 102 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2018 లో ఏర్పాటు చేశారు

నిర్మాణం : చైర్మన్ + 4 సభ్యులు

ఎంపిక : రాష్ట్రపతి ద్వారా

కాలపరిమితి : 3 సంవత్సరాలు (ఒకరినే రెండు ధఫాలు కంటే ఎక్కువ సార్లు నియమించరాదు)

విధులు :

ఓబీసీ కులాల వారి హక్కులను కాపాడటం మరియు వారి రాజ్యాంగం కల్పించిన విధానాలను అమలు జరిగేలా చూడడం.

ఓ బి సి జాబితాలో కులాలను చేర్చడం మరియు తొలగించడం

9) NATIONAL COMMISSION FOR LINGUISTIC MINORITIES

ఆర్టికల్ : 350 – B

ఏర్పాటు : 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1956లో ఏర్పాటు చేశారు.

నిర్మాణం : లింగ్విస్టిక్ మైనారిటీస్ యొక్క ప్రతినిధులు

ఎంపిక : రాష్ట్రపతి ద్వారా

విధులు :

భాషాపరమైన మైనారిటీ ల హక్కులను కాపాడటం

రాష్ట్రపతికి మరియు గవర్నర్ లకు ప్రతి ఏడాది నివేదిక అందించడం

10) COMPTROLLER and AUDITOR GENERAL (CAG)

ఆర్టికల్స్ : 148 నుండి 151

కాలపరిమితి : 6 సంవత్సరాలు / 65 సంవత్సరాలు

తొలగించు విధానం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించినట్లు

విధులు :

ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయడం

ఆర్థిక నిర్వహణకు జవాబుదారి కల్పించడం

నివేదికలను రాష్ట్రపతి మరియు పార్లమెంటుకు సమర్పించడం

11) ATTORNEY GENERAL OF INDIA (AGI)

ఆర్టికల్ – 76

కాలపరిమితి : రాష్ట్రపతి అభీష్టం మేరకు

నియామకం : రాష్ట్రపతి ద్వారా

రాజీనామా : రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను సమర్పించాల్సి ఉంటుంది.

విధులు :

కేంద్ర ప్రభుత్వానికి లీగల్ అడ్వైజర్ గా ఉంటుంది

సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో కేంద్ర ప్రభుత్వానికి రిప్రెజెంటేటివ్ గా ఉంటుంది

అన్ని కోర్టులలో హాజరయ్యే అవకాశం ఉంటుంది

12) ADVOCATE GENERAL OF THE STATE (AG)

ఆర్టికల్ – 165

కాలపరిమితి : గవర్నర్ అభీష్టం మేరకు

నియామకం : గవర్నర్ ద్వారా

రాజీనామా : గవర్నర్ కు తన రాజీనామా లేఖను సమర్పించాల్సి ఉంటుంది.

విధులు :

రాష్ట్ర ప్రభుత్వానికి లీగల్ అడ్వైజర్ గా ఉంటుంది

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక లాయర్ గా ఉంటుంది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు