BIKKI NEWS (MARCH 13) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ 2024 పరీక్షల కంటే ముందే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష నిర్వహించి తాజాగా బిఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు (CONDUCT TET EXAM BEFORE DSC 2024 SAYS HARISH RAO) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
ఇంతకుముందు టెట్ పరీక్ష రాసినప్పటికీ అర్హత సాధించని వారు మరియు తాజాగా బిఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న దాదాపు 50 వేల మంది అభ్యర్థులకు టెట్ పరీక్ష ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. కేవలం టెట్ అర్హత లేని కారణంగా టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు.
కావున నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే టెట్ నిర్వహించి, తదనంతరం డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు.