తెలంగాణ మిగులు నిధులు పై ఎర్పడిన కమీటీలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 25) : తెలంగాణ తొలిదశ ఉద్యమం సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న 1969లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పరిస్థితి చేయి దాటి పోతుంది అని గమనించి 1969 జనవరి 18, 19 వ తేదీలలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు

ఈ సమావేశానికి దాదాపు 45 మంది ప్రతినిధులు హాజరై ఒక అంగీకారానికి వచ్చారు దీనినే “అఖిలపక్ష ఒప్పందం (ఆల్ పార్టీ అకార్డ్)” అంటారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలో తెలంగాణ మిగులు నిధులు పై లెక్క తేల్చడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలి.

ఈ సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధుల పై వివిధ కమిటీలు వేసింది. అవి…

1) కుమార్ లలిత్ కమిటీ (1969 జనవరి) :-

1969 జనవరి 19న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ మిగులు నిధుల పరిశీలన కోసం కాగ్ అధికారైనా కుమార్ లలిత్ కమిటీని 1969 జనవరిలో నియమించింది.

ఈ కమిటీ 1956 నవంబర్1 నుండి 1968 మార్చి 31 వరకు జరిగిన కేటాయింపులన్నీ పరిశీలించి తెలంగాణ రెవెన్యూ ఖాతాలో 102 కోట్లు మిగులు నిధులు ఉన్నాయని దీనిలోనికర మిగులు 63.92 కోట్ల అని పేర్కొంది.

తెలంగాణలో ఖర్చు పెట్టాల్సి ఉండి కూడా పెట్టని మిగులు నిధులు 34.10 కోట్లు అని పేర్కొంది.

2) జస్టిస్ భార్గవ కమిటీ (1969 ఎప్రిల్) :-

కుమార్ లలిత్ కమిటీ నిధులు గణించడంలో పొరపాట్లు చేసిందని భావించిన కేంద్ర ప్రభుత్వం అష్ట సూత్ర పథకంలో భాగంగా 1969 ఏప్రిల్ 11న భార్గవ నేతృత్వంలో తెలంగాణ మిగులు నిధుల పై మరొక కమిటీని వేసింది

వశిష్ట భార్గవ నేతృత్వంలో తెలంగాణ మిగులు నిధుల పై ఏర్పడిన కమిటీ 123 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ దీనిని అధికారికంగా బయటపెట్టలేదు. భార్గవ కమిటీ తన నివేదికలో 1956 – 68 సంవత్సరాల కాలంలో తెలంగాణ మిగులు నిధులు 28.34 కోట్లు అని తేల్చింది తెలంగాణ ప్రాంత నిధులు తెలంగాణపై ఖర్చు పెట్టలేదని… పెద్దమనుషుల ఒప్పందం అమలు చేయలేదని… కావున అదనపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

3) వాంఛూ కమిటీ (1969) :-

ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయమని కేంద్ర ప్రభుత్వం 1969లో వాంఛూ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యక్షుడు కే.ఎన్. వాంఛూ ఇతర సభ్యులు నిరన్ డే మరియు ఎంపీ సెతల్వాడ్.

ఈ కమిటీ 1969లోనే నివేదిక సమర్పించింది రాష్ట్ర ఉద్యోగాల్లో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది కానీ, ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం వారికి ప్రాధాన్యత లభించేలా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు లేదని… ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి వీలు లేదని… ఈ విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం, అవకాశం లేదని పేర్కొంది.

Follow Us @