ప్రభుత్వ విద్యా సంస్థలలో కోవిడ్ నిబంధనల అమలుకు నిధులు విడుదల చేయాలి – మధుసూదన్ రెడ్డి

ఒక సంవత్సరం తరువాత రాష్ట్రం లోని విద్యా సంస్థలలో కోలాహలం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని విద్యాసంస్థల్లో కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఇంటర్విద్యా జేఏసీ చైర్మన్ డా. పి. మధుసూదన్ రెడ్డి అభిప్రాయం.

ఇన్నిరోజులు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్/డిజిటల్ పద్దతులలో జరిగిన ఆన్లైన్ విద్య భౌతికంగా బోధించే విద్యకు ప్రత్యామ్నాయం కాదు, ఆన్లైన్ విద్య ద్వారా మాత్రమే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని తెలుసు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం భౌతికంగా తరగతుల ప్రారంభించడానికి తీసుకుంది.

ఇంటర్నీడియట్ మొదటి, రెండవ సంవత్సరం రెండు కూడా ప్రారంభించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఒక కళాశాలకు 7 నుండి 9 సెక్షన్ లకు అనుమతి ఇచ్చింది, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలల్లో కూడా 1000 కి పైగా విద్యార్థులు ఉన్నటువంటి కళాశాలలు కూడా ఉండడం వీటన్నిటి నేపథ్యంలో ఆయా కళాశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నింటిపై సమగ్ర మైనటువంటి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి పంపించడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మార్గదర్శకాలు విడుదల చేసిందో వాటిని కచ్చితంగా అమలు చేస్తూ విజయవంతంగా కళాశాలలను నడిపించాలి.

కానీ ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉచిత విద్య కారణంగా నిధుల లేమితో కూనరిల్లుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు, స్థానిక ప్రజా ప్రభుత్వాలు ఈ బాధ్యత తీసుకుంటాయని చెప్పారు కానీ పూర్తి సహకారం అందే పరిస్థితి లేదు. కావునా ముఖ్యమంత్రి వెంటనే ఈ సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ప్రభుత్వ విద్యా సంస్థలలో కోవిడ్ నిబంధనలు సక్రమంగా అమలు కోసం నిధులు విడుదల చేయాలి.

నిధుల లేమి కారణంగా కోవిడ్ నిబంధనలు పాటించకుండా విద్యా సంస్థలు నడిస్తే ఎవరికైనా ఆ విద్యా సంస్థలో కోవిడ్ భారిన పడితే అటు విద్యార్థులకు, ఇటు విద్యా సంస్థ సిబ్బందికి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావునా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రభుత్వ విద్యా సంస్థలకు తగినన్ని నిధులు విడుదల చేయాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని ఇంటర్విద్యా జేఏసీ చైర్మన్ డా. పి. మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@