పిబ్రవరి 1నుండి విద్యా సంస్థలు ప్రారంభం.

సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1 నుండి 9 వ తరగతి పైబడిన తరగతులకు ప్రత్యక్ష బోధన జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో రేపటి నుండి భౌతిక తరగతులు ప్రారంభం కానున్నాయి

కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే 8 నెలల విలువైన కాలాన్ని కోల్పోయింది. అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి డిజిటల్/ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు భౌతిక తరగతులు నిర్వహించడానికి విద్యా సంస్థలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. విద్యార్థులు తప్పనిసరిగా తల్లిదండ్రుల నుంచి కళాశాలకు హాజరయ్యేందుకు అనుమతి పత్రాన్ని తీసుకొని రావలసి ఉంటుంది లేనిచో వారికి కళాశాలల్లో ప్రవేశం లేదు.

అలాగే జ్వరం, జలుబు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు విద్యాసంస్థలకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈ విద్యా సంవత్సరం హాజరు విషయంలో విద్యార్థులకు మినహాయింపు ఉందని ఇంటివద్ద నుండి ఆన్లైన్ తరగతులు విని పరీక్షకు హాజరు కావొచ్చని విద్యాశాఖ మంత్రి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

డిగ్రీ, పీజీ వంటి తరగతులకు కేవలం 50 శాతం మంది విద్యార్థులను మాత్రమే తరగతులకు అనుమతించాలని కూడా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇంటర్మీడియట్లో ఒకరోజు మొదటి సంవత్సరం రెండవ రోజు ద్వితీయ సంవత్సరం తరగతులను నిర్వహించడానికి మరియు వీలుకాకుంటే ఉదయం ప్రథమ సంవత్సరం సాయంత్రం ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహించుకునే వెసులుబాటు కూడా కళాశాలకు బోర్డు అనుమతించింది.

Follow Us@