ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు సంవత్సరానికి 30 వేల కోల్గేట్ స్కాలర్ షిప్

  • కీప్ ఇండియా స్మయిలింగ్ ఫౌండేషనల్ స్కాలర్షిప్

కోల్గేట్ – పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ‘కీప్ ఇండియా స్మయిలింగ్ ఫౌండేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ను నిర్వహిస్తోంది. పదవ తరగతి, ఇంటర్/తత్సమాన కోర్స్ ఉత్తీర్ణులై ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు దీనిని ఉద్దేశించారు.

అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదు.

చివరి తేదీ ::నవంబరు 30 – 2021

★ ఇంటర్ విద్యార్థులకు ::

ఈ ఏడాది పదవ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన కాలేజ్లో ఇంటర్ / 11వ తరగతిలో ప్రవేశం పొంది ఉండాలి.

ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు స్కాలర్షిప్ ఇస్తారు.

★ ఇంజనీరింగ్ విద్యార్థులకు ::

ఈ ఏడాది ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ ఫస్టియర్ లో ప్రవేశం పొంది ఉండాలి.

ఏడాదికి రూ.30,000 చొప్పున నాలుగేళ్లు స్కాలర్షిప్ ఇస్తారు.

★ డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు ::

ప్రధమ శ్రేణి మార్కులతో ఇంటర్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన కళాశాలలో మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి.

ఏడాదికి రూ.30,000 చొప్పున మూడేళ్లు స్కాలర్షిప్ ఇస్తారు.

★ క్రీడాకారులకు ::

గత రెండు, మూడేళ్లలో రాష్ట్ర జాతీయ / అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం దేశం తరపున ఏ క్రీడా విభాగంలోనైనా ప్రాతినిధ్యం వహించి ఉండాలి. దేశవ్యాప్తంగా 500 లోపు, రాష్ట్రవ్యాప్తంగా 100 లోపు ర్యాంకు సాధించి ఉండాలి. జూన్ 30 నాటికి 9 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రముఖ క్రీడా సంస్థ / పెడరేషన్ / అకాడమీ / కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉండాలి.

ఏడాదికి రూ.75,000 చొప్పున మూడేళ్లు స్కాలర్షిప్ ఇస్తారు.

★ సమాజ సేవకులకు ::

చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద పిల్లలకు చదువు చెప్పడం, క్రీడాంశాలలో శిక్షణ ఇస్తూ ఉండాలి

ఏడాదికి రూ.75,000 చొప్పున రెండేళ్లు స్కాలర్షిప్ ఇస్తారు.

వెబ్సైట్ ::
https://colgatecares.co.in/keepindiasmiling/index.html

Follow Us @